Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నంత పనీ చేసిన Ishan Kishan

కొలంబో: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అన్నంత పనీ చేశాడు. శ్రీలంకతో నిన్న జరిగిన తొలి వన్డేలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన ఇషాన్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు.


శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఓపెనర్ పృథ్వీషా రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే తాను ఎదుర్కొన్న తొలి బంతినే లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. 23 ఏళ్ల ఇషాన్ మ్యాచ్ అనంతరం యుజ్వేంద్ర చాహల్ ‘చాహల్ టీవీ’తో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 


బ్యాటింగ్‌కు వస్తూ తొలి బంతినే సిక్స్ కొడతానని సహచరులకు చెప్పానని పేర్కొన్నాడు. బౌలర్ ఎవరైనా తనకు పనిలేదని, ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొడతానని చెప్పి మాట నిలబెట్టుకున్నానని చెప్పాడు. ‘’ఈ రోజు నా బర్త్ డే. దీనికి తోడు నేను 50 ఓవర్లు వికెట్ల వెనక ఉన్నాను. పిచ్ స్పిన్నర్లకు అంత అనుకూలంగా లేదని నాకు తెలుసు. కాబట్టి తొలి బంతికి సిక్సర్ కొట్టేందుకు ఇదే మంచి సమయమని భావించాను’’ అని కిషన్ చెప్పుకొచ్చాడు. 


Advertisement
Advertisement