Abn logo
Apr 21 2021 @ 01:07AM

ఐఎస్‌బీకి మరో గుర్తింపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) అగ్రగామిగా నిలిచింది. ‘ద ఎస్‌సీఎం జర్నల్‌ లిస్ట్‌’లో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సంపాదించింది. మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ విశ్వవిద్యాలయాలు, 2015-20 మధ్య కాలంలో బిజినెస్‌ సూళ్లు, సంస్థల్లో  చేపట్టిన మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌పరంగా భారత్‌లో ఐఎ్‌సబీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 100 స్థానాల్లో నిలిచిందని ఐఎ్‌సబీ   తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో జరిగిన రీసెర్చ్‌ని ద ఎస్‌సీఎ జర్నల్‌ లిస్ట్‌ పరిగణనలోకి తీసుకుంటుంది.  


Advertisement
Advertisement
Advertisement