కేంద్ర పర్యావరణశాఖ ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యిందా?.. ఎన్జీటీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-08-16T20:36:04+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫొటోలు

కేంద్ర పర్యావరణశాఖ ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యిందా?.. ఎన్జీటీ ఆగ్రహం

ఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫొటోలు చూస్తుంటే పనులు భారీగానే జరిగినట్లు అర్ధమవుతుందని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అర్ధమవుతందని ఎన్జీటీ పేర్కొంది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే నిబంధనల ప్రకారం అధికారులను జైలుకు పంపిన సందర్భాలున్నాయా? అని పిటీషనర్లను ఎన్జీటీ అడిగింది. అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా? లేక హైకోర్టు ద్వారా పంపాలా? అన్న విషయాన్ని చెప్పాలని పిటిషనర్లను ఎన్జీటీ కోరింది.


అధికారులను శిక్షించిన సందర్భాలు ఇంతవరకూ ఎదురు కాలేదని ఎన్జీటీ పేర్కొంది. తనిఖీ నివేదికను ఆన్‌లైన్‌లో ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ సమర్పించింది. కేంద్ర పర్యావరణశాఖ ఏపి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యిందా? అని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకూ కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు నివేదిక దాఖలు చేయలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. 7వ తేదీ నాటికే పనులను నిలిపివేశామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఆ తరువాత ఎటువంటి పనులు చేయలేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విచారణ ఈ నెల 27కి ఎన్జీటీ వాయిదా వేసింది. 27న తదుపరి చర్యలపై తీర్పు ఇస్తామని ఎన్జీటీ తెలిపింది.



Updated Date - 2021-08-16T20:36:04+05:30 IST