ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2022-01-30T02:56:12+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోల్ మాల్

ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో దండే విఠల్‌ను  ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్  భారీగా ఖర్చు చేసింది.


ఏకగ్రీవం కోసం అభ్యర్థులను టీఆర్‌ఎస్ కొనుగోలు చేసింది. తుడుం దెబ్బ నేతలు డబ్బులు తీసుకున్న ఫోటోలు వైరల్‌‌గా మారాయి. టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు ఆదివాసీ అభ్యర్థి పుష్పరాణి సహకారించినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ సమక్షంలో డీల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్ కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుడుం దెబ్బ నేతలు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.  




Updated Date - 2022-01-30T02:56:12+05:30 IST