ఇస్త్రీ పెట్టె వైరును మెడకు బిగించి భర్త హత్య
ABN , First Publish Date - 2020-04-10T08:03:58+05:30 IST
కట్టుకున్న భర్తను ఓ ఇల్లాలు దారుణంగా హతమార్చిన ఉదంతమిది. ఈ ఘటన మేడ్చల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
మేడ్చల్, ఏప్రిల్ 9: కట్టుకున్న భర్తను ఓ ఇల్లాలు దారుణంగా హతమార్చిన ఉదంతమిది. ఈ ఘటన మేడ్చల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రాజబొల్లారం గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ (35) వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. తరుచూ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో గురువారం ఆమె కృష్ణ మెడకు ఇస్త్రీపెట్టె వైరును గట్టిగా బిగించి హత్య చేసింది.