వివోకు అనుకూలమైతే.. ఒప్పందం రద్దు కష్టమే!

ABN , First Publish Date - 2020-07-02T09:09:29+05:30 IST

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌ వివోతో ఒప్పందం రద్దు విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. కాంట్రాక్ట్‌ రద్దు నిబంధన ‘ఎగ్జిట్‌ క్లాజ్‌’

వివోకు అనుకూలమైతే.. ఒప్పందం రద్దు కష్టమే!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌ వివోతో ఒప్పందం రద్దు విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. కాంట్రాక్ట్‌ రద్దు నిబంధన ‘ఎగ్జిట్‌ క్లాజ్‌’ వివోకు అనుకూలంగా ఉంటే.. ఒప్పందం రద్దు చేసుకొనే అవకాశాలు లేవని బీసీసీఐ అధికారి ఒకరు చె ప్పారు.  ‘ఎగ్జిట్‌ క్లాజ్‌’ వివోకు అనుకూలంగా ఉంటే.. ఏడాదికి రూ. 440 కోట్ల ఆదాయాన్ని తాము వదులుకోవాల్సివస్తుంది. ఒకవేళ నిబంధనలు బీసీసీఐకి అ నుకూలంగా ఉంటే మాత్రం కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకొనే అవకాశాలున్నాయ’ని ఆయన తెలిపారు. కాగా, ఐపీఎల్‌ను ఒక్క నగరంలోనే నిర్వహించే విధంగా చూడాలని టోర్నీ ప్రధాన భాగస్వాముల్లో ఒకరు ప్రతిపాదించినట్టు సమాచారం.

Updated Date - 2020-07-02T09:09:29+05:30 IST