IPL Final: ప్రారంభమైన ముగింపు వేడుకలు.. స్టెప్పులతో అదరగొడుతున్న రణ్‌వీర్ సింగ్

ABN , First Publish Date - 2022-05-30T00:27:21+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికాసేట్లో గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్

IPL Final: ప్రారంభమైన ముగింపు వేడుకలు.. స్టెప్పులతో అదరగొడుతున్న రణ్‌వీర్ సింగ్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికాసేట్లో గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ టైటిల్ పోరులో తలపడనున్న వేళ నరేంద్రమోదీ స్టేడియంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో వంద శాతం మంది  ప్రేక్షకులను అనుమతించడంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా గంటపాటు ముగింపు వేడుకలు జరగనున్నాయి. మూడేళ్ల తర్వాత ముగింపు వేడుకలు జరగుతుండడంతో బీసీసీఐ అదిరిపోయే ఏర్పాట్లు చేసింది. 


బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ బృందం డ్యాన్స్‌తో ముగింపు వేడకలు ప్రారంభమయ్యాయి. ‘83’ సినిమాలోని ‘జీతేగా జీతేగా’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసి ప్రేక్షకులను మైమరపిస్తున్నాడు. మ్యూజిక్ మాస్ట్రో, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్  తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నారు. ఈ వేడుకకు  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు గౌరవ కార్యదర్శి జై షా, పలువురు మాజీ కెప్టెన్లు హాజరయ్యారు. జార్ఖండ్‌లోని ప్రసిద్ధ ఛౌ డ్యాన్స్‌ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇందుకోసం జార్ఖండ్‌కు చెందిన 10 మంది ఛౌ కళాకారులను రప్పించారు. అలాగే, ఈ వేడుకల్లో ఈ 75 ఏళ్లలో భారత్‌లో క్రికెట్ ప్రస్థానాన్ని బిగ్ స్క్రీన్లపై చూపించనున్నారు. 

Updated Date - 2022-05-30T00:27:21+05:30 IST