IPL 2021 FINAL: కోల్‎కతాపై చెన్నై ఘన విజయం

ABN , First Publish Date - 2021-10-16T12:22:01+05:30 IST

ఐపీఎల్-14 విజేత చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో కోల్‎కతా నైట్ రైడర్స్ జట్టును 27 పరుగుల తేడాతో చెన్నై ఓడించింది. కేకేఆర్ బ్యాట్స్‎మెన్స్ విఫలం కావడంతో చెన్నై చేతిలో ఘోర పరాజయాన్ని

IPL 2021 FINAL: కోల్‎కతాపై చెన్నై ఘన విజయం

దుబాయి: ఐపీఎల్-14 విజేత చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో కోల్‎కతా నైట్ రైడర్స్ జట్టును 27 పరుగుల తేడాతో చెన్నై ఓడించింది. కేకేఆర్ బ్యాట్స్‎మెన్స్ విఫలం కావడంతో చెన్నై చేతిలో ఘోర పరాజయాన్ని కేకేఆర్ మూటగట్టుకుంది. సీఎస్‎కే ఈ విజయంతో నాలుగోసారి ట్రోఫిని సొంతం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32) పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్ మెన్ రాబిన్ ఉతప్ప (31) రన్స్ ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఉతప్ప, గైక్వాడ్ ఔటైనా..డుప్లెసిస్ దూకుడుగా ఆడి స్పీడ్‎గా హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా (37) పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికే చెన్నై భారీ స్కోర్ సాధించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ 192 రన్స్ చేసింది.


193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‎కతా జట్టు దూకుడుగా ఛేజింగ్‎గా ఆరంభించింది. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభమన్ గిల్ (51) ధాటిగా ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. అయ్యర్, గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యార్ భారీ షాట్‎కు ప్రయత్నించి జడ్డుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇక్కడి నుంచి చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్ ఆటగాళ్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కోల్‎కతా బ్యాటింగ్‎లో కార్తిక్ (9), షకీబ్ (0), రాహుల్ త్రిపాఠి (2), మోర్గాన్ (4) ఘోరంగా విఫలం కావడంతో కేకేఆర్ ఓటమి చవిచూసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేరికి కోల్‎కతా జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్‎కే బౌలింగ్‎లో ఠాకూర్ 3, హేజిల్‎వుడ్ 2, జడేజా 2, చాహర్, బ్రావో చెరో వికెట్ తీశారు. దీంతో సీజన్-14 ఐపీఎల్ ఛాంపియన్‎గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.

Updated Date - 2021-10-16T12:22:01+05:30 IST