‘మే లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం’

ABN , First Publish Date - 2021-01-21T20:12:25+05:30 IST

ఇప్పటి వరకు సైన్స్ సబ్జెక్ట్‌లో 80శాతం సిలబస్ పూర్తి అయ్యిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు.

‘మే లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం’

హైదరాబాద్: ఇప్పటి వరకు సైన్స్ సబ్జెక్ట్‌లో  80శాతం సిలబస్ పూర్తి అయ్యిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. మిగిలిన రోజుల్లో పెండింగ్ సిలబస్, ప్రాక్టికల్స్ నిర్వహణ మీద దృష్టి పెడతామన్నారు. ఇప్పటి వరకు 70 శాతం పిల్లలు ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి కన్సెంట్ లెటర్ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అటెండేన్స్ తప్పని సరి అంటూ ఏమి లేదని  చెప్పారు. ఎగ్జామ్ ఫీజ్ కట్టి పరీక్షలు రాయవచ్చని తెలిపారు. మొత్తం 70శాతం సిలబస్ నుంచే పరీక్షలు నిర్వహణ ఉంటుందన్నారు. 30శాతం ప్రాజెక్ట్ రూపంలో అసైన్మెంట్ ఇస్తామని చెప్పారు. 


జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ఆందోళన అవసరం లేదన్నారు. నిర్ధారించిన సిలబస్ మొత్తం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.  వచ్చే ఏడాది సైతం రెగ్యులర్,ఆన్లైన్ చదువు ఉంటుందని ఆయన చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రమోట్ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. మే లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. పరీక్షల టైం టేబుల్ మీద ఇవాళ విద్యాశాఖకి రిపోర్ట్ ఇస్తున్నామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణపై ఇవాళ ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర విభాగాలు విభజించి క్లాసుల నిర్వహణ ఉంటుందన్నారు.

Updated Date - 2021-01-21T20:12:25+05:30 IST