‘జియో’లో ఇంటెల్‌ పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-07-04T06:30:35+05:30 IST

ఫేస్‌బుక్‌ ఈ కంపెనీలో 9.99 శాతం వాటాను రూ.43,573 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాలం లో సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబాదలా ఇన్వె్‌స్టమెంట్స్‌, అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్

‘జియో’లో ఇంటెల్‌ పెట్టుబడులు

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన డిజిటల్‌ సేవల సంస్థలో మరో టెక్నాలజీ దిగ్గజం పెట్టుబడులు పెట్టింది. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటా విక్రయం ద్వారా ఇంటెల్‌ క్యాపిటల్‌ నుంచి రూ.1,894.50 కోట్లు సేకరించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. కంప్యూటర్‌ చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్‌కు చెందిన పెట్టుబడుల విభాగమే ఇంటెల్‌ క్యాపిటల్‌. ఇంటెల్‌ క్యాపిటల్‌తో కలిపి ఇప్పటివరకు జియోలో 12 దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో విక్రయించిన మొత్తం వాటా 25.09 శాతం. కాగా, సేకరించిన పెట్టుబడుల విలువ రూ.1,17,588.45 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్‌ 22న ఫేస్‌బుక్‌తో తొలి ఒప్పంద ప్రకటన వెలువడింది.


ఫేస్‌బుక్‌ ఈ కంపెనీలో 9.99 శాతం వాటాను రూ.43,573 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాలం లో సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబాదలా ఇన్వె్‌స్టమెంట్స్‌, అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్‌, టీపీజీ, ఎల్‌ కాటెర్టాన్‌, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టా యి. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి భారీగా పెట్టుబడుల ప్రవాహంతో పాటు దేశంలో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.53,124 కోట్లు సేకరించింది. తద్వారా ఆర్‌ఐఎల్‌ రుణ రహిత కంపెనీగా మారిందని గతన ెలలో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.


జియో మీట్‌ సేవలు షురూ

సాధారణ వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో.. వెబ్‌ కాన్ఫరెన్సింగ్‌ యా ప్‌ ‘జియో మీట్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సమావేశంలో పాల్గొనే వ్యక్తి ఒకేసారి 100 మంది యూజర్లతో ముచ్చటించే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు వెల్లడించిం ది. వెబ్‌ కాన్ఫరెన్సింగ్‌ యాప్స్‌ అయిన జూమ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, సిస్కో వెబెక్స్‌, గూగుల్‌ మీట్‌లకు పోటీగా రిలయన్స్‌ ఈ యాప్‌ను రూపొందించింది. కరోనా నేపథ్యంలో వెబ్‌ ఆధారిత సమావేశాలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతూ వస్తున్న సంగ తి తెలిసిందే. వెబ్‌ కాన్ఫరెన్సింగ్‌ యాప్స్‌.. ఒక సెషన్‌లో భారీ స్థాయిలో యూజర్లను సమావేశపరిచేందు కు చార్జీలను వసూలు చేస్తుండగా జియో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ఫీజులను వసూలు చేయకుండా ఈ సేవలను అందించనుంది.

Updated Date - 2020-07-04T06:30:35+05:30 IST