పెళ్లికి బీమా!

ABN , First Publish Date - 2022-07-24T09:09:33+05:30 IST

ఈ రోజుల్లో పెళ్లంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

పెళ్లికి బీమా!

ఈ రోజుల్లో పెళ్లంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫంక్షన్‌హాల్‌, షామియానా, క్యాటరింగ్‌ దగ్గరి నుంచి బాజాభజంత్రీలు, వీడియోగ్రాఫర్‌ వరకు అన్నీ ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, అనివార్య కారణాలతో తంతు ఆగిపోతే..? వాయిదా పడితే..? లేదా ఏదైనా దుర్ఘటన చోటుచేసుకుంటే..? భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే, కొన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు పెళ్లికి కూడా బీమాకవరేజీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఆ వివరాలు.. 


 పెళ్లి రద్దు, వాయిదా, తేదీ మార్పు

ఈ సందర్భంలో డెకరేషన్‌, క్యాటరింగ్‌, హోటల్‌, ఫంక్షన్‌హాల్‌, ప్రయాణ సేవలు, వినోద కళాకారులు, వాయిద్యకారులకు  చెల్లించాల్సిన సొమ్ముకు బీమా కవరేజీ లభిస్తుంది. 


ఆస్తి లేదా విలువైన వస్తు నష్టం 

అగ్ని ప్రమాదం, పేలుడు, భూకంపం కారణంగా పెళ్లి జరుగుతున్న వారి ఇళ్లు, వివాహ వేదిక లేదా డెకరేషన్‌ సెట్టింగ్స్‌  సహా ప్రాపర్టీ్‌సకు కలిగే నష్టంతో పాటు ఒకవేళ పెళ్లిలో దొంగతనం జరిగి ఏదైనా విలువైన వస్తువు కోల్పోయినా బీమా కవరేజీ వర్తిస్తుం


 యాక్సిడెంట్‌ 

పాలసీ వర్తించే వ్యక్తులకు వివాహోత్సవ సమయంలో యాక్సి డెంట్‌ జరిగి పాక్షిక లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినప్పుడు గానీ, పెళ్లిలో ఏదైనా దుర్ఘటన కారణంగా థర్డ్‌ పార్టీకి (వివాహానికి హాజరైన వారు) గాయమైనా లేదా నష్టం జరిగిన సందర్భం లోనూ బీమా  సదుపాయం వర్తిస్తుంది. 


వీటికి వర్తించదు.. 

అసహజ మరణం లేదా గాయంతో పాటు ఏదైనా వ్యాధి, యుద్ధం, తీవ్రవాదం, అపహరణకు గురైన కారణంగా మరణించినా లేదంటే ఆత్మహత్యకు పాల్పడినా బీమా కవరేజీ లభించదు.


బీమా కాలపరిమితి

నిర్దేశిత వివాహ కార్యక్రమ సమయానికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. సాధారణంగా ఏడు రోజుల వరకు లభించే బీమా కవరేజీ కాలపరిమితి.. పెళ్లి మరుసటి తేదీతో ముగుస్తుంది. 


ఏయే కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి..? 

ఐసీఐసీఐ లొంబార్డ్‌

ఫ్యూచర్‌ జెనెరాలీ

బజాజ్‌ అలియాంజ్‌ 

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ 

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 


ప్రీమియం ఎంత..? 

ఏ విధమైన, ఎంత బీమా కవరేజీ కోరుకుంటున్నారనే అంశాలపై ప్రీమియం రేటు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా  సమ్‌ అస్యూర్డ్‌లో 0.2-0.4 శాతం స్థాయిలో ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఉదాహరణకు, రూ.40 లక్షల బీమా కవరేజీతో కూడిన ఫ్యూచర్‌ జెనెరాలీ పాలసీకి రూ.10,000-15,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-07-24T09:09:33+05:30 IST