ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వల్ల అడ్డంగా దొరికిపోయిన పనిమనిషి.. దుబాయిలో..

ABN , First Publish Date - 2021-01-26T20:21:35+05:30 IST

సోషల్ మీడియా ఖాతా వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి. దుబాయిలోని ఓ మహిళకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే శాపం

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వల్ల అడ్డంగా దొరికిపోయిన పనిమనిషి.. దుబాయిలో..

దుబాయి: సోషల్ మీడియా ఖాతా వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి. దుబాయిలోని ఓ మహిళకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే శాపంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ దుబాయిలోని ఓ ఇంట్లో పనిచేస్తూ ఆ ఇంట్లోనే నివసిస్తోంది. ఇటీవల పని మనిషి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఇంటి యజమానికి అనుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పనిమనిషి ఖాతా కనిపించింది. వెంటనే ఓపెన్ చేయగా పనిమనిషి పోస్ట్ చేసిన ఫొటో చూసి ఆశ్చర్యపోయాడు.


పనిమనిషి వేసుకున్న డ్రెస్ తన భార్యదనే విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యకు ఆ ఫొటోను చూపించగా.. తన బట్టలు కనిపించడం లేదని చెప్పింది. దీంతో పని మనిషే బట్టలను దొంగిలించినట్టు తెలుసుకున్నారు. పనిమనిషి గదిని తనిఖీ చేయగా ఇంట్లో కనిపించకుండా పోయిన అనేక వస్తువులు అక్కడే దొరికాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకాలం నుంచి దొంగతనానికి పాల్పడుతూ వచ్చినందుకు పనిమనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 28న పనిమనిషిని కోర్టులో హాజరుపర్చనున్నారు.

Updated Date - 2021-01-26T20:21:35+05:30 IST