ఫాస్ట్‌ చార్జింగ్‌లో ‘ఇన్‌ఫినిక్స్‌’

ABN , First Publish Date - 2022-07-02T08:53:11+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ఈ మధ్య కాలంలో ఫాస్ట్‌ చార్జింగ్‌పై దృష్టి సారించాయి. వన్‌ప్లస్‌, ఒప్పో, షావోమీ, రియల్మే ఇప్పటికే రంగంలో ఉన్నాయి.

ఫాస్ట్‌ చార్జింగ్‌లో ‘ఇన్‌ఫినిక్స్‌’

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ఈ మధ్య కాలంలో ఫాస్ట్‌ చార్జింగ్‌పై దృష్టి సారించాయి. వన్‌ప్లస్‌, ఒప్పో, షావోమీ, రియల్మే ఇప్పటికే రంగంలో ఉన్నాయి.  తాజాగా ‘ఇన్‌ఫినిక్స్‌’ ఆ గోదాలోకి దిగింది. 180 వాట్స్‌ చార్జింగ్‌ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. ‘థండర్‌ చార్జ్‌’ పేరిట స్మాల్‌ క్లిప్‌ సహకారంతో ఈ టెక్నాలజీ ఉంది. సదరు క్లిప్‌పై ఉండే ఆన్‌స్ర్కీన్‌ లేబుల్‌పై 180డబ్ల్యు థండర్‌ చార్జ్‌ అని ఉంటుంది. అయితే సదరు కంపెనీ ఇంతవరకు అధికారికంగా చార్జింగ్‌ వేగాన్ని పేర్కొనలేదు. గత ఏడాది జరిపిన పరీక్షల ప్రకారం 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ - 160 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ టెక్నాలజీ కింద కేవలం పది నిమిషాల్లో చార్జింగ్‌ పూర్తయింది. దానికి బదులుగా ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 120 వీఐపీ, 120 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 17 నిమిషాల్లో పని పూర్తికానిచ్చిందని కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా 180 వాట్స్‌ చార్జింగ్‌పై కంపెనీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Updated Date - 2022-07-02T08:53:11+05:30 IST