‘అండగా ఉంటూ.. ప్రజల ఆస్తులను అమ్మడం దారుణం’

ABN , First Publish Date - 2022-09-05T23:11:43+05:30 IST

‘అండగా ఉంటూ.. ప్రజల ఆస్తులను అమ్మడం దారుణం’

‘అండగా ఉంటూ.. ప్రజల ఆస్తులను అమ్మడం దారుణం’

నిర్మల్: జిల్లాలోని దిలావర్ పూర్‌లో ఎల్ఐసీ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. కార్పోరేట్‌ శక్తులకు అండగా నిలుస్తూ.. ప్రజల ఆస్తులను అమ్ముతోందని ఆరోపించారు. ఎల్‌ఐసిని కాపాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ దోచిపెడుతోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎల్‌ఐ‌సి ఉద్యోగులను కూడా రోడ్డు మీదకు తెచ్చి, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఆదానీ, అంబానీలకు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ ఆదాయం అంతా కార్పొరేట్లకు పెడుతోందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-09-05T23:11:43+05:30 IST