భారతీయ విద్యార్థులకు బాసటగా నిలిచిన హోటల్ యజమానులు!

ABN , First Publish Date - 2020-03-27T01:12:36+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 22 వేల మంది మరణించారు. 4.86 లక్షల మందికి వైరస్ సోకింది. మహమ్మారి

భారతీయ విద్యార్థులకు బాసటగా నిలిచిన హోటల్ యజమానులు!

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 22 వేల మంది మరణించారు. 4.86 లక్షల మందికి వైరస్ సోకింది. మహమ్మారి ప్రభావం అగ్రరాజ్యం అమెరికాలో కూడా తీవ్రంగా ఉంది. అయితే ఇప్పటికే అప్రమత్తమైన ట్రంప్ సర్కార్.. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలు, కాలేజీలను మూసేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెరికాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లు కూడా మూతపడటంతో దాదాపు 2,50,000మంది భారతీయ విద్యార్థులు రోడ్డునపడ్డారు.


స్వదేశానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు భారత సంతతికి చెందిన హోటల్ యజమానులు బాసటగా నిలిచారు. భారత రాయబార కార్యలయం ఇచ్చిన పిలుపు మేరకు.. కొందరు హోటల్ యజమానులు విద్యార్థులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి వసతితో పాటు భోజనాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా సుమారు 700 హోటళ్లలోని 6000 వేల గదులను భారతీయ విద్యార్థుల వసతికి కేటాయించినట్లు హోటల్ యజమానులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇండియన్ అంబాసిడర్ తరంజిత్ సింగ్ సంధు స్పందించారు. హోటల్ యజమానుల నిర్ణయాన్ని ఆయన అభినందించారు. అందరం కలిసి కొవిడ్-19కు ఓడిద్దామంటూ పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-03-27T01:12:36+05:30 IST