రజతపతకం గెలిచిన రెజ్లర్ దహియా షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2021-08-06T10:27:27+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి దహియా రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. బంగారు పతకాన్ని తృటిలో కోల్పోయాడు. రష్యన్ రెజ్లర్, రెండు సార్లు..

రజతపతకం గెలిచిన రెజ్లర్ దహియా షాకింగ్ కామెంట్స్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి దహియా రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. బంగారు పతకాన్ని తృటిలో కోల్పోయాడు. రష్యన్ రెజ్లర్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జావుర్ ఉగుయెవ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి చవి చూశాడు. దీంతో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే రజత పతకం గెలవడంపై దహియా ఏ మాత్రం సంతోషాన్ని ప్రదర్శించలేదు. మెడల్ తన మెడలో వేసుకునే సమయంలో కూడా ఆనందాన్ని ప్రదర్శించలేదు. పతకాల బహూకరణ అనంతరం మీడియాతో మాట్లాడిన దహియా.. ‘దీనివల్ల ఏం లాభం. నేను ఇక్కడికి ఒకే లక్ష్యంతో వచ్చాను. అది గోల్డ్ మెడల్ సాధించడం. కానీ సాధించలేకపోయాను. ఇది కూడా పర్లేదు. కానీ బంగారు పతకం కాదు కదా.. ఈ రోజుకు జవూర్ బెస్ట్ రెజ్లర్. అందుకే ఈ సారి నేను సిల్వర్ మెడల్‌కు అర్హుడిగా మిగిలిపోయాను’ అని దహియా పేర్కొన్నాడు. 


అయితే ఒలింపిక్ చరిత్రలో సిల్వర్ మెడల్ గెలిచిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో రవి దహియా 6వ ఆటగాడు. అయితే ఈ విషయాన్ని అతడికి చెబితే ఓ నవ్వును సమాధానంగా విసిరాడు.

Updated Date - 2021-08-06T10:27:27+05:30 IST