భారత యువకుడికి జాక్‌పాట్.. కలలో కూడా ఊహించనంత డబ్బు..

ABN , First Publish Date - 2021-12-18T15:53:30+05:30 IST

భారత్‌కు చెందిన యువకుడికి జాక్‌పాట్ తగిలింది. దీంతో అతడి ఇంట్లో కాసుల వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన రఫీక్ మహ్మద్ దుబాయ్‌లో నివసి

భారత యువకుడికి జాక్‌పాట్.. కలలో కూడా ఊహించనంత డబ్బు..

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన యువకుడికి జాక్‌పాట్ తగిలింది. దీంతో అతడి ఇంట్లో కాసుల వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన రఫీక్ మహ్మద్ దుబాయ్‌లో నివసిస్తూ.. ఓ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి సరదాగా లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ మిలియనీర్ డ్రాలో ఏకంగా 1 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ.2కోట్లు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రఫీక్  మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. గెలిచిన డబ్బులతో ముందుగా అప్పులు తీర్చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా అందులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు, తనతోపాటు లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన తన ఫ్రెండ్స్‌కు ఇవ్వనున్నట్టు పేర్కొన్నాడు. 




Updated Date - 2021-12-18T15:53:30+05:30 IST