ఐపీఎల్ వేళ హల్‌చల్ చేస్తున్న కోహ్లీ వీడియో

ABN , First Publish Date - 2020-08-10T03:34:22+05:30 IST

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో బెంగళూరుకు కూడా సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తప్ప మరే...

ఐపీఎల్ వేళ హల్‌చల్ చేస్తున్న కోహ్లీ వీడియో

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో బెంగళూరుకు కూడా సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తప్ప మరే జట్టుకు కోహ్లీ ఆడలేదు. 8ఏళ్లుగా కెప్టెన్‌గా కూడా జట్టును నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ తన ఇనస్టాగ్రాంలో ఓ వీడియో షేర్ చేశాడు. ఇన్నేళ్లుగా జట్టుకు ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని, అన్నింటికంటే విదేయతే అత్యున్నతమైందని అందులో పేర్కొన్నాడు. తొలి నుంచి ఆర్సీబీతో సాగిన తన ప్రయాణంపై కొన్ని వీడియోలను కలిసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అన్నిటికంటే విధేయతే అత్యున్నతమైంది. ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నంటూ ఆ వీడియోకు కోహ్లీ కాప్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆర్సీబీకి వచ్చిన ఆటగాళ్లు వేరే జట్టుకు వెళ్లడానికి ఇష్టపడరని, డివిలియర్స్ కూడా అందుకే ఆర్సీబీకే ఆడుతున్నాడని కోహ్లీ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-08-10T03:34:22+05:30 IST