నాసా మార్స్ రోవర్‌ను కంట్రోల్ చేస్తోంది ప్రవాస భారతీయుడే..!

ABN , First Publish Date - 2021-03-02T09:28:32+05:30 IST

నాసా ప్రవేశపెట్టిన ‘పర్సీవరెన్స్ రోవర్’ ఫిబ్రవరి 19న విజయవంతంగా మార్స్‌ ఉపరితలంపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మార్స్‌పై మనిషి జీవించగలడా లేదా అనేది తెలుసుకునేందుకు మూడు బిలియన్ డాలర్ల(రూ. 22 వేల కోట్లకు పైగా) వ్యయంతో నాసా ఈ మిషన్‌ను మొదలుపెట్టింది.

నాసా మార్స్ రోవర్‌ను కంట్రోల్ చేస్తోంది ప్రవాస భారతీయుడే..!

లండన్: నాసా ప్రవేశపెట్టిన ‘పర్సీవరెన్స్ రోవర్’ ఫిబ్రవరి 19న విజయవంతంగా మార్స్‌ ఉపరితలంపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మార్స్‌పై మనిషి జీవించగలడా లేదా అనేది తెలుసుకునేందుకు మూడు బిలియన్ డాలర్ల(రూ. 22 వేల కోట్లకు పైగా) వ్యయంతో నాసా ఈ మిషన్‌ను మొదలుపెట్టింది. దాదాపు ఏడు నెలల పాటు ప్రయాణించిన పర్సీవరెన్స్ రోవర్ విజయవంతంగా మార్స్ ఉపరితలంపై ల్యాండ్ అయి అక్కడి ఫొటోలను పంపుతోంది. 


ఇదిలా ఉంటే.. ఈ పర్సీవరెన్స్ రోవర్‌ను ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తోంది ఎవరో తెలుసా? సంజీవ్ గుప్తా అనే ఓ ప్రవాస భారతీయుడు లండన్‌లోని తన ఫ్లాట్ నుంచి ఈ రోవర్‌ను కంట్రోల్ చేస్తున్నారంటే నమ్ముతారా? అవును నిజం.. కరోనా మహమ్మారి కారణంగా తన చిన్న ఫ్లాట్‌ను సంజీవ్ గుప్తా కంట్రోల్ రూంగా మార్చుకుని పనిచేస్తున్నారు. కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ నుంచి పనిచేయాల్సిన తాను కరోనా కారణంగా లండన్‌లోని ఫ్లాట్ నుంచి పనిచేయాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు. 


కాలిఫోర్నియాలో పనిచేయడం కుదరదని తెలుసుకున్న సంజీవ్ గుప్తా లండన్‌ నుంచి పనిచేసేందుకు ప్రత్యేకంగా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదనే తాను విడిగా మరో ఫ్లాట్‌ను తీసుకున్నానని ఆయన తెలిపారు. ఈ ఫ్లాట్‌లో ఐదు కంప్యూటర్లు, రెండు ఇతర స్క్రీన్లను ఏర్పాటు చేసుకుని ఎప్పుటికప్పుడు నాసా బృందంతో కలిసి పనిచేస్తున్నారు. కాగా.. పర్సీవరెన్స్ రోవర్ మిషన్‌లో దాదాపు 400 మంది పనిచేస్తుండగా.. సంజీవ్ గుప్తా రోవర్‌ను కంట్రోల్ చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. పర్సీవరెన్స్ రోవర్ మార్స్‌పై డ్రిల్లింగ్ చేస్తూ శాంపిల్స్‌ను సేకరిస్తుంది. ఇలా సేకరించిన శాంపిల్స్ 2027 నాటికి భూమికి చేరుకుంటాయి.  

Updated Date - 2021-03-02T09:28:32+05:30 IST