కెనడా సుప్రీం న్యాయమూర్తిగా భారత సంతతి జడ్జి

ABN , First Publish Date - 2021-06-19T13:24:10+05:30 IST

భారత సంతతికి చెందిన జస్టిస్‌ మహ్మూద్‌ జమాల్‌ను కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి (ప్యూస్నీ జడ్జి)గా నామినేట్‌ చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. జమాల్‌కు న్యాయ శాస్త్రంలో, వ్యవహారాల్లో చాలా అనుభవం ఉందని ట్రూడో కొనియాడారు. సుప్రీంకోర్టుకు చెందిన గొప్ప సంపదగా ఆయన నిలుస్తారని వ్యాఖ్యానించారు.

కెనడా సుప్రీం న్యాయమూర్తిగా భారత సంతతి జడ్జి

తొలి శ్వేతజాతీయేతరుడిగా జస్టిస్‌ జమాల్‌

టొరొంటో, జూన్‌ 18: భారత సంతతికి చెందిన జస్టిస్‌ మహ్మూద్‌ జమాల్‌ను కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి (ప్యూస్నీ జడ్జి)గా నామినేట్‌ చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. జమాల్‌కు న్యాయ శాస్త్రంలో, వ్యవహారాల్లో చాలా అనుభవం ఉందని ట్రూడో కొనియాడారు. సుప్రీంకోర్టుకు చెందిన గొప్ప సంపదగా ఆయన నిలుస్తారని వ్యాఖ్యానించారు. కెనడా సుప్రీంకోర్టుకు నామినేట్‌ అయిన తొలి శ్వేతజాతీయేతరుడిగా మహ్మూద్‌ జమాల్‌ నిలిచారు. గతంలో కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్‌ అయిన తొలి యూదు మహిళగా రోసాలీ సిల్బెర్మాన్‌ అబెల్లా నిలిచారు. కెన్యాలో భారత సంతతికి చెందిన దంపతులకు మహ్మూద్‌ జమాల్‌ 1967లో జన్మించారు. అనంతరం జమాల్‌ తల్లిదండ్రులు బ్రిటన్‌ వెళ్లారు. అక్కడి నుంచి 1981లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు.

Updated Date - 2021-06-19T13:24:10+05:30 IST