Abn logo
Oct 3 2021 @ 08:42AM

Kuwait లోని ఆస్పత్రి Toilet లో విగతజీవిగా కనిపించిన భారతీయ నర్సు..!

కువైత్ సిటీ: కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ నర్సు అక్కడి ఓ ఆస్పత్రిలో విగతజీవిగా కనిపించింది. సభా మెడికల్ రీజియన్‌లో ఐబీఎన్ సినా ఆస్పత్రిలోని టాయిలెట్‌లో 35 ఏళ్ల జస్లీన్ అనే భారతీయ నర్సు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. జస్లీన్‌ది కేరళ రాష్ట్రం ఇరింజలకుడా. ఆమె రక్షణ మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఐబీఎన్ సినా ఆస్పత్రిలోని టాయిలెట్‌లో వాటర్ పైప్‌ను మెడకు చుట్టుకుని సూసైడ్ చేసుకుంది. 

టాయిలెట్‌లో విగతజీవిగా పడి ఉన్న జస్లీన్‌ను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధారించారు. అయితే, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రాథమిక విచారణ ప్రకారం ఆమె మెదడులో కణితి(ట్యూమర్) కారణంగా కొంతకాలంగా మానసిక మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. జస్లీన్‌కు భర్త సిజో పాలోస్, పిల్లలు జసీల్, జోవిన్ ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో జస్లీన్ స్వస్థలమైన ఇరింజలకుడాలో విషాదం అలుముకుంది.   

తాజా వార్తలుమరిన్ని...