Abn logo
Jul 27 2021 @ 07:56AM

కువైత్‌లో భారతీయ నర్సు అరెస్ట్!

కువైత్‌ సిటీ: డబ్బులు తీసుకుని నకిలీ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు గాను ఓ భారతీయ నర్సుతో పాటు మరో ఇద్దరు ఈజిప్ట్ నర్సులను కువైత్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా క్రిమినల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఈ ముగ్గురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపించారు. టీకా వేసుకోని వారి దగ్గర నుంచి 250-300 కువైతీ దిర్హమ్స్ తీసుకుని వీరు నకిలీ కరోనా సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇలా మొత్తం నలుగురికి ఫోర్జరీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. కువైత్‌లోని జహ్రా ఆస్పత్రికి చెందిన ఈ ముగ్గురు నర్సులు ఇలా ఫోర్జరీ సర్టిఫికేట్లతో గత కొంతకాలంగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్ గుర్తించింది.  

తాజా వార్తలుమరిన్ని...