America: సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా ఎన్నారై భారీ స్కెచ్.. చివరికి అతడికి ఏ గతి పట్టిందంటే..

ABN , First Publish Date - 2022-08-05T21:13:59+05:30 IST

అతడు ఒక ఎన్నారై(Nri). కొన్నేళ్లుగా అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్నాడు. చెమట చిందించకుండా.. ఏ మాత్రం కష్టపడకుండా భారీగా డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలోనే కొంత మం

America: సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా ఎన్నారై భారీ స్కెచ్.. చివరికి అతడికి ఏ గతి పట్టిందంటే..

ఎన్నారై డెస్క్: అతడు ఒక ఎన్నారై(Nri). కొన్నేళ్లుగా అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్నాడు. చెమట చిందించకుండా.. ఏ మాత్రం కష్టపడకుండా భారీగా డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలోనే కొంత మంది వ్యక్తులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. అయితే చివరికి అతడికి ఏ గతి పట్టిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.



ఆశిష్ బజాజ్(29) కొన్నేళ్ల క్రితం ఇండియా నుంచి అమెరికా(America)కు వలస వెళ్లాడు. అనంతరం కొన్ని రోజులపాటు అక్కడ పలు సంస్థల్లో పని చేశాడు. ఆ తర్వాత అతడు వక్ర బుద్ధితో ఆలోచించాడు. ఈజీగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు.. కొంత మంది వ్యక్తులతో జత కట్టి అమెరికా వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్ల(senior American citizens)ను టార్గెట్ చేశాడు. ఈ బృందం వృద్ధుల వివరాలు సేకరించింది. అనంతరం ‘మేము ఫ్రాడ్ ప్రివెన్షన్ స్పెషలిస్టులం(fraud prevention specialists) మాట్లాడుతున్నాం. మీ బ్యాంకు అకౌంట్లు, ఆన్‌లైన్ పేమెంట్ అకౌంట్లను కొందరు టార్గెట్ చేశారు. డబ్బులు దోచుకునేందుకు భారీ ప్రణాళిక రచించారు. అయితే భయపడాల్సిన పలిలేదు. స్టింగ్ ఆపరేషన్ చేసి మేము వాళ్లను పట్టుకుంటాం. అయితే అందుకు కొంత డబ్బును మా అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి‘ అని మాయమాటలు చెప్పారు. ఆశిష్ బజాజ్.. అతడి బృందం చేప్పిన మాటలు విని భయాందోళనకు గురైన కొందరు వృద్ధులు.. వాళ్లు చెప్పినట్టే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత తాము మోసపోయినట్టు గ్రహించారు.


కాగా.. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. ఆశిష్ బజాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతడు కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే కోర్టు ఆశిష్ బజాజ్‌ను దోషిగా తేల్చింది. అతడికి సుమారు 20ఏళ్ల జైలు శిక్ష పడొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 


Updated Date - 2022-08-05T21:13:59+05:30 IST