యూఎస్‌లో కరోనాతో భారత వ్యక్తి మృతి !
ABN , First Publish Date - 2020-04-01T15:01:29+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3890 మంది చనిపోయారు.
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3890 మంది చనిపోయారు. తాజాగా ఈ మహమ్మారి న్యూయార్క్‌లో ఓ భారత వ్యక్తిని కూడా పొట్టనబెట్టుకుంది. మృతుడిని కేరళ రాష్ట్రం పతనమిట్ట జిల్లా ఎలంతూర్‌కు చెందిన థామస్ డేవిడ్(43)గా గుర్తించారు. థామస్ న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఉద్యోగి. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అతనికి కొవిడ్-19 సోకింది. దాంతో ఆస్పత్రిలో చేరాడు. మొదట తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో చేరిన థామస్‌ను ఆ తర్వాత ఐసియూకి తరలించారు. ఐసియూలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. ఈ ఘటనతో థామస్ స్వస్థలం ఎలంతూర్‌లో విషాదం నెలకొంది.