ఖతర్‌లోని NEET అభ్యర్థులకు షాక్.. ఎగ్జామ్ షెడ్యూల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన Indian embassy

ABN , First Publish Date - 2022-07-11T14:56:35+05:30 IST

ఖతర్‌లోని NEET అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(NTA) షాకిచ్చింది. విద్యార్థుల డిమాండ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.50 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఎగ్జామ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఖతర్‌లోని..

ఖతర్‌లోని NEET అభ్యర్థులకు షాక్.. ఎగ్జామ్ షెడ్యూల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన Indian embassy

ఎన్నారై డెస్క్: ఖతర్‌లోని NEET అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(NTA) షాకిచ్చింది. విద్యార్థుల డిమాండ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.50 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఎగ్జామ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఖతర్‌లోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2022-23 విద్యా సంవత్సరం కోసం కొద్ది రోజుల క్రితం NEET ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే దీనిపై ఖతర్‌లోని నీట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్‌ను పోస్ట్ చేయాలంటూ దాదాపు 40 రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. NEET-UG 2021 కౌన్సెలింగ్ మేలో ముగిసింది. అలాగే.. CBSE 12th బోర్డు పరీక్షలు జూన్ 15న ముగిశాయి. దీంతో చేస్తున్నారు. NEET-UG 2022 ఎంట్రెన్స్ పరీక్షకు హాజరయ్యే వారికి ప్రిపరేషన్‌కు సరిపడా సమయం లభించకుండా పోయింది.





అందువల్ల నీట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయాలంటూ ఆన్‌లైన్ వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను 19 పేజీల మెమోరండం ద్వారా విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ.. అభ్యర్థుల డిమాండ్‌పై విద్యాశాఖ స్పందించలేదు. పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 17 ఎగ్జామ్ నిర్వహించేందుకు మార్గదర్శకాలకు విడుదల చేసింది. తాజాగా ఈ మార్గదర్శకాలను Qatar‌లోని ఇండియన్ ఎంబసీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. NEET-UG 2022 ఎంట్రెన్స్ టెస్టు కోసం విదేశఆల్లోని భారత విద్యార్థులతో సహా మొత్తం 18.72లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 


Updated Date - 2022-07-11T14:56:35+05:30 IST