కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసిన భారత ఎంబసీ

ABN , First Publish Date - 2020-08-27T18:31:04+05:30 IST

కువైట్‌లోని భారత ఎంబసీ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసీడబ్ల్యూఎఫ్) నిర్వహించడానికి బుధవారం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసిన భారత ఎంబసీ

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత ఎంబసీ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసీడబ్ల్యూఎఫ్) నిర్వహించడానికి బుధవారం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. భారత కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ కోసం అన్ని అభ్యర్థనలను పరిశీలించడానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇక నిన్న ఎంబసీ ఆడిటోరియంలో జరిగిన సెకండ్ వీక్ ఓపెన్ హౌజ్ మీటింగ్‌లో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న భారతీయులకు ఈ నిధిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంబసీ, కువైట్‌లోని మూడు పాస్‌పోర్ట్ కార్యాలయాల వద్ద ఐసీడబ్ల్యూఎఫ్ అప్లికేషన్ బాక్స్‌లను తెరిచామని అన్నారు.


ఈ వారం ఓపెన్ హౌస్ ఐసీడబ్ల్యూ ఫండ్‌పై దృష్టి పెడుతుందని చెప్పారు. రాయబార కార్యాలయం ఐసీడబ్ల్యూఎఫ్ సహాయ ఫారమ్‌ను ఎంబసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుందని రాయబారి తెలిపారు. అలాగే పాస్‌పోర్ట్ కేంద్రాల్లో నియామక వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రాయబారి... అన్ని దరఖాస్తులను ఒకే రోజున స్వీకరించాలని ఆదేశించారు. పాస్‌పోర్ట్‌ సెంటర్ సమయం కూడా పెరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వచ్చే వారం జరిగే ఓపెన్ హౌజ్ మీటింగ్‌లో కువైట్‌లో భారతీయ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టిసారిస్తామని తెలియజేశారు. రాయబార కార్యాలయం ఎంబసీ లోపల ఒక థిమాటిక్ లైబ్రరీని కూడా ప్రారంభించిందని, ప్రతిరోజూ కువైట్‌లో భారతీయతను జరుపుకునే ఈ లైబ్రరీని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మార్చడమే మా ప్రయత్నం అని సిబి జార్జ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-27T18:31:04+05:30 IST