Advertisement
Advertisement
Abn logo
Advertisement

టైమ్స్ స్క్వేర్ వద్ద రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

వాషింగ్టన్: న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద వరుసగా రెండో ఏడాది భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికాలోని భారతీయులు టైమ్స్ స్క్వేర్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ‘భారత్ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారతీయులు హాజరయ్యారు. కాగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement