కమలా హారిస్‌కు అండగా నిలిచిన ఇండియన్ అమెరికన్లు!

ABN , First Publish Date - 2020-10-19T00:27:49+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఇండియన్ అమెరికన్లు, డెమొక్రటిక్ మద్దతుదారులు #MyNameIs హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న అ

కమలా హారిస్‌కు అండగా నిలిచిన ఇండియన్ అమెరికన్లు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఇండియన్ అమెరికన్లు, డెమొక్రటిక్ మద్దతుదారులు #MyNameIs హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రిపబ్లిక్, డెమొక్రటిక్ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రిపబ్లిక్ సెనెటర్ డేవిడ్ పెర్డ్యూ.. జార్జియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి పేరును.. ‘క..మ..ల? కమల..మల..మల? నాకు తెలియదు’ అంటూ హేళన చేస్తూ పలికారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా #MyNameIs హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ప్రారంభించారు. కాగా.. కొద్ది సమయంలోనే ఈ హ్యాష్‌టాగ్ వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కొందరు ఇండియన్ అమెరికన్లు.. ఈ హ్యాష్‌టాగ్‌కు తమ పేరును జత చేస్తూ, పేరుకు ఉన్న అర్థాన్ని వివరిస్తున్నారు.


Updated Date - 2020-10-19T00:27:49+05:30 IST