Miss India USA 2022: ఆర్య వాల్వేకర్‌‌కు మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం

ABN , First Publish Date - 2022-08-07T17:53:49+05:30 IST

వర్జీనియాకు చెందిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్‌ (Aarya Walvekar)కు మిస్ ఇండియా యూఎస్ (Miss India USA 2022) కిరీటం దక్కింది. న్యూజెర్సీలో జరిగిన ఈ అందాల పోటీల్లో 18 ఏళ్ల ఆర్య విజేతగా నిలిచి ఈ ఏడాది కిరీటం దక్కించుకుంది. ఇక ఇదే పోటీలలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రీ మెడికల్ విద్యార్ధిని సౌమ్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా..

Miss India USA 2022: ఆర్య వాల్వేకర్‌‌కు మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం

వాషింగ్టన్: వర్జీనియాకు చెందిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్‌ (Aarya Walvekar)కు మిస్ ఇండియా యూఎస్ (Miss India USA 2022) కిరీటం దక్కింది. న్యూజెర్సీలో జరిగిన ఈ అందాల పోటీల్లో 18 ఏళ్ల ఆర్య విజేతగా నిలిచి ఈ ఏడాది కిరీటం దక్కించుకుంది. ఇక ఇదే పోటీలలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రీ మెడికల్ విద్యార్ధిని సౌమ్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఆర్య మాట్లాడుతూ.. 'వెండితెరపై నన్ను నేను చూసుకోవాలి. సినిమాలు, టీవీల్లో పనిచేయాలి. ఇదే నా చిన్న నాటి కల' అని అన్నారు. అలాగే కొత్త ప్రదేశాలను అన్వేషించడం, వంటలు చేయడం, చర్చా కార్యక్రమాలలో పాల్గొనడం తన హాబీలుగా పేర్కొంది. 


ఈ ఏడాది పోటీల ప్రత్యేకత ఇదే..

మిస్ ఇండియా యూఎస్ పోటీలు ప్రారంభించి ఈ ఏడాదితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఇండియాకు వెలుపల ఎక్కువ కాలం నడుస్తోన్న, భారతీయులే నిర్వహిస్తున్న పోటీ కావడం విశేషం. ఈ పోటీలను వరల్డ్ వైడ్ పేజెంట్స్ బ్యానర్‌పై న్యూయార్క్‌కు చెందిన ఇండో-అమెరికన్స్ (Indian-Americans) ధర్మాత్మ, నీలం శరణ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మాత్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కమ్యూనిటీ మద్ధతుతోనే ఇన్నేళ్లుగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు.    


Updated Date - 2022-08-07T17:53:49+05:30 IST