అగ్రరాజ్యంలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-04-20T20:04:08+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు డిఫెన్స్ అడ్వైజర్‌గా భారత మూలాలు ఉన్న మహిళ నియామకం అయ్యారు. ఇందు

అగ్రరాజ్యంలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు డిఫెన్స్ అడ్వైజర్‌గా భారత మూలాలు ఉన్న మహిళ నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఎస్ నావీ కీలక హోదాలో పని చేస్తున్న శాంతి సేతీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, డిఫెన్స్ అడ్వైజర్‌గా నియామకం అయ్యారు. ఈ నియామకం పట్ల శాంతి సేతీ సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. 1993లో శాంతి సేతీ అమెరికా నేవీలో జాయిన్ అయ్యారు. అనంతరం క్షిపణి విధ్వంసక నౌక యూఎస్ఎస్ డెకాటలర్(USS Decatur) కమాండర్‌గా 2010-12 మధ్య బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్ నౌకాదళ నౌక ద్వారా ఇండియాను సందర్శించిన తొలి మహిళా కమాండర్‌గా ఈమె గుర్తింపు పొందారు. శాంతి సేతీ తండ్రి 1960ల్లో అమెరికాకు వలస వెళ్లారు. 




Updated Date - 2022-04-20T20:04:08+05:30 IST