Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారతీయ అమెరికన్‌కు రూ.5.30కోట్ల జరిమానా, ఐదున్నరేళ్ల జైలు.. చేసిన నేరమేంటంటే..

న్యూ మెక్సికో: అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఐపాడ్‌ స్కామ్‌లో ఓ భారతీయ అమెరికన్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు పరిహారంగా 7,13,619 డాలర్లు(రూ.5.30కోట్లు) చెల్లించాలని తీర్పునిచ్చింది. మూడేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో తుది తీర్పుని మేరీల్యాండ్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు గురువారం వెల్లడించింది. ఈ కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు అమెరికన్లకు కూడా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం... క్రిస్టినా స్టాక్‌ (46) అనే మహిళా న్యూమెక్సికోలో ఓ ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పని చేసేది. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంటర్నెట్‌ని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వం ఐపాడ్‌లు ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా భారీ స్థాయిలో యాపిల్ కంపెనీ ఐపాడ్‌ కొనుగోలు చేసింది. ఈ వ్యవహారాలను క్రిస్టినా పర్యవేక్షించింది. 


ఈ క్రమంలో వాటిని క్రిస్టినా పక్కదారి పట్టించింది. విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐపాడ్‌లను భారతీయ అమెరికన్ అయిన సౌరభ్ చావ్లా(36)కి అందించింది. వాటిని సౌరభ్ చావ్లా.. ఈబేతో పాటు ఇతర ఈ కామర్స్‌ సైట్స్‌ ద్వారా విక్రయించారు. ఇలా వీరిద్దరు 2012 నుంచి 2018 వరకు సుమారు ఆరేళ్ల పాటు ఈ స్కామ్‌ కొనసాగించారు. మొత్తంగా ఆరేళ్లలో ఒక మిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 74 కోట్లు) విలువ చేసే 3,000లకు పైగా ఐపాడ్‌లను అమ్మేశారు. చివరకు ఈ ఐపాడ్ స్కామ్ 2018లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. గురువారం మేరీల్యాండ్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఈ కేసులో తుది తీర్పుని వెల్లడించింది. క్రిస్టినా స్టాక్‌, సౌరభ్ చావ్లాతో పాటు మరో అమెరికన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. సౌరభ్‌కు 66 నెలల జైలు శిక్షతో పాటు ఐఆర్ఎస్‌కు పరిహారం రూపంలో రూ. 5.30కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement