England‌తో చివరి వన్డే.. టాస్ గెలిచిన Team India

ABN , First Publish Date - 2022-07-17T21:04:04+05:30 IST

సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో భారత జట్టు (Team India) టాస్ గెలిచి ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది.

England‌తో చివరి వన్డే.. టాస్ గెలిచిన Team India

మాంచెస్టర్: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో భారత జట్టు (Team India) టాస్ గెలిచి ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన రోహిత్‌ సేన.. రెండో వన్డేలో దారుణంగా ఓడింది. బ్యాటింగ్‌లో చేతులెత్తేయడంతో 100 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ కీలకంగా మారింది. గెలిచిన వారికి సిరీస్ సొంతం కానుంది.


రెండో వన్డేలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత్ నేటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కీలక మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. టీ20లో అనుసరించిన దూకుడు మంత్రాన్నే నేటి మ్యాచ్‌లోనూ అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ (England) జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, భారత  జట్టులో మాత్రం ఒక మార్పు చోటుచేసుకుంది. బౌలింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నా బుమ్రా (Jasprit Bumrah)కు బదులుగా సిరాజ్ (Siraj) జట్టులోకి వచ్చాడు. బుమ్రా కొంత అసౌకర్యంగా ఉండడంతో అతడిని బరిలోకి దించి రిస్క్ చేయడం ఇష్టం లేకే విశ్రాంతి కల్పించినట్టు రోహిత్ (Rohit Sharma) చెప్పాడు. 

Updated Date - 2022-07-17T21:04:04+05:30 IST