England vs India: టాస్ గెలిచిన ఇండియా
ABN , First Publish Date - 2021-08-25T20:53:03+05:30 IST
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో లీడ్స్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
లీడ్స్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో లీడ్స్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్టును ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టాస్ ఓడిపోవడం కొంత ఆనందంగానే ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. సిబ్లీ స్థానంలో మలాన్, మార్క్ వుడ్ స్థానంలో ఓవెర్టన్ జట్టులోకి వచ్చారు.