Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాన్పూరు టెస్టు.. విజయం ముంగిట భారత్

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. విజయం కోసం భారత్, డ్రా కోసం న్యూజిలాండ్ ప్రయత్నిస్తున్నాయి. భారత్ విజయానికి మరో మూడు వికెట్లే అవసరం కాగా, న్యూజిలాండ్ డ్రా చేయాలంటే ఇంకా దాదాపు 17 ఓవర్లు క్రీజులో నిలవాల్సి ఉంటుంది.


చివరి వరస బ్యాటర్లు క్రీజులో ఉన్నారు కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చు. అశ్విన్ మరోమారు బంతిని తిప్పుతున్నాడు కాబట్టి న్యూజిలాండ్‌కు ఓటమి తప్పకపోవచ్చు. ప్రస్తుతం 79 ఓవర్లు ముగిశాయి. న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర, జెమీసన్ క్రీజులో ఉన్నారు.

Advertisement
Advertisement