శ్రీలంకతో పింక్‌బాల్ టెస్ట్: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

ABN , First Publish Date - 2022-03-12T21:30:14+05:30 IST

శ్రీలంకతో ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న పింక్‌బాల్ (డే/నైట్) టెస్టులో భారత జట్టు 76 పరుగులకు..

శ్రీలంకతో పింక్‌బాల్ టెస్ట్: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

బెంగళూరు: శ్రీలంకతో ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న పింక్‌బాల్ (డే/నైట్) టెస్టులో భారత జట్టు 76 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 10 పరుగులకే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు మాత్రమే చేసిన మయాంక్ రనౌటై వెనుదిరిగాడు.


ఆ స్కోరుకు మరో 19 పరుగులు జోడించిన తర్వాత మరో ఓపెనర్ అయిన రోహిత్ శర్మ (15) కూడా పెవిలియన్ చేరాడు. హనుమ విహారి,  కోహ్లీ కలిసి జాగ్రత్తగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినట్టే కనిపించారు. నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 31 పరుగులు చేసిన హనుమ విహారి కూడా అవుటయ్యాడు. దీంతో 76 పరుగులకే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కోహ్లీ, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-03-12T21:30:14+05:30 IST