భారత వృద్ధి -6.4 శాతం : కేర్‌

ABN , First Publish Date - 2020-07-03T06:42:48+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో ఇప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 6.4 శాతానికి పడిపోతుందని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వాస్తవానికి మే నెలలో ప్రకటించిన అంచనాలో వృద్ధి రేటు క్షీణతను 1.5-1.6 శాతమని ఈ సంస్థ

భారత వృద్ధి -6.4 శాతం : కేర్‌

ముంబై: కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో ఇప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 6.4 శాతానికి పడిపోతుందని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వాస్తవానికి మే నెలలో ప్రకటించిన అంచనాలో వృద్ధి రేటు క్షీణతను 1.5-1.6 శాతమని ఈ సంస్థ ప్రకటించింది. కానీ జూలై నెల వచ్చినా కూడా ప్రజల కదలికలు, కొన్ని సేవల పునరుద్ధరణపై ఆంక్షలు కొనసాగుతూ ఉండడం వృద్ధిని మరింతగా క్షీణింపచేస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. మూడో త్రైమాసికం చివరిలో లేదా నాలుగో త్రైమాసికం ప్రారంభం నాటికి గాని సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడంలేదని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు -6.4 శాతానికి పడిపోవచ్చునని తాజా అంచనాలో తెలిపింది. జీడీపీ క్షీణతతో పాటు ద్రవ్యోల్బణం 5 శాతం మేరకు ఉండవచ్చన్న అంచనాను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది విత్తలోటు కూడా 8 శాతం వరకు ఉండవచ్చని తెలిపింది. 

Updated Date - 2020-07-03T06:42:48+05:30 IST