ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ టాప్

ABN , First Publish Date - 2021-01-20T00:05:39+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ టాప్

బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న తర్వాత ర్యాంకింగ్స్‌లో భారత జట్టు దూసుకుపోతోంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను కిందికి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించిన భారత జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది.


ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు  9 మ్యాచుల్లో విజయం సాధించింది.  మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒకటి డ్రా అయింది. ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 420 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. బ్రిస్బేన్ టెస్ట్ ప్రారంభానికి ముందు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 332 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది.


Updated Date - 2021-01-20T00:05:39+05:30 IST