సెంచరీ దాటిన భారత్ స్కోరు.. వంద దిశగా రోహిత్

ABN , First Publish Date - 2021-08-13T01:16:15+05:30 IST

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ

సెంచరీ దాటిన భారత్ స్కోరు.. వంద దిశగా రోహిత్

లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డులో పరుగులు పెంచుకుంటూ పోతున్నారు. ఇద్దరూ కలిసి బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. క్రీజులో కుదురుకున్న తర్వాత రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఓ సిక్సర్ కూడా బాదాడు. అర్ధ సెంచరీ పూర్తయ్యాక కూడా జోరు తగ్గించలేదు సరికదా మరికాస్త పెంచాడు.


మరోవైపు, అతడికి సహకరిస్తున్న రాహుల్ నిదానంగా ఆడుతూ ఆతిథ్య జట్టు బౌలర్లకు చిరాకు తెప్పిస్తున్నాడు. ఇంగ్లండ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.  ప్రస్తుతం 39 ఓవర్లు ముగిశాయి. టీమిండియా వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. రోహిత్ 82, రాహుల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-08-13T01:16:15+05:30 IST