కోహ్లీని అగౌరవపరుస్తూ..
ABN , First Publish Date - 2021-06-26T09:04:17+05:30 IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ న్యూజిలాండ్ వెబ్సైట్ దారుణంగా అవమానపరిచింది.
వెల్లింగ్టన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ న్యూజిలాండ్ వెబ్సైట్ దారుణంగా అవమానపరిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లోనూ పేసర్ జేమిసన్ చేతిలోనే అవుటయ్యాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘ది ఏసీసీఎన్జడ్’ అనే స్పోర్ట్స్ వెబ్సైట్ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రా మ్లో పోస్ట్ చేసింది. ఇందులో మోకాళ్లపై పురుషుడు కూర్చోగా.. అతడి మెడకున్న పట్టీని ఓ మహిళ నవ్వుతూ చేతితో పట్టుకుని ఉంది. పైగా ఆ మహిళపై జేమిసన్ పేరు, పురుషుడిపై కోహ్లీ పేరును ఉంచి తన వెకిలితనాన్ని చాటుకుంది. ఈ పోస్ట్‌పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.