India vs West Indies: అర్ధ సెంచరీలతో అదరగొట్టిన అయ్యర్, పంత్

ABN , First Publish Date - 2022-02-11T21:36:44+05:30 IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్

India vs West Indies: అర్ధ సెంచరీలతో అదరగొట్టిన అయ్యర్, పంత్

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు అంతగా కలిసి రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (13) మరోమారు నిరాశ పరచగా, శిఖర్ ధవన్ (10) దారుణంగా విఫలమయ్యాడు. ఇక, మాజీ సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. రెండు బంతులు మాత్రమే ఆడిన విరాట్ డకౌట్ అయ్యాడు.


42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన జట్టును శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ గాడిన పెట్టారు. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయ్యర్ 74 బంతుల్లో 6 ఫోర్లతో వన్డేల్లో 9వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కాసేపటికే పంత్ కూడా అర్ధ శతకం పూర్తి చేశాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో ఐదో అర్ధ సెంచరీ నమోదు చేశాడు.


అయితే, దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెడన్ వాల్ష్ బౌలింగులో షాట్‌కు యత్నించి షాయ్ హోప్‌కు దొరికిపోయాడు. దీంతో అయ్యర్-పంత్‌ 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.


విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా, ఓడియన్ స్మిత్, హెడన్ వాల్ష్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిశాయి. టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (61), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-02-11T21:36:44+05:30 IST