భోజన విరామానికి భారత్ 80/4.. కోహ్లీ డకౌట్

ABN , First Publish Date - 2021-03-05T17:42:25+05:30 IST

మెుతేరాలో ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు భోజన విరామానికి ఆతిథ్య భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.

భోజన విరామానికి భారత్ 80/4.. కోహ్లీ డకౌట్

అహ్మదాబాద్‌: మెుతేరాలో ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు భోజన విరామానికి ఆతిథ్య భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. 24/1 స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 16 పరుగులు జోడించి ఛటేశ్వర్ పుజారా(17) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రోహిత్ శర్మతో జట్టు కట్టిన వైస్ కెప్టెన్ రహానే మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడాడు.


27 పరుగులు చేసి కుదురుకున్నట్లు కనిపించిన రహానే.. అండర్సన్ వేసిన ఓ చక్కటి బంతికి బోల్తా పడ్డాడు. దీంతో ఈ ద్వయం 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్(32) ఉండగా.. భారత్ స్కోర్: 80/4(37.5 ఓవర్లు). ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 2 వికెట్లు తీయగా.. స్టోక్, లీచ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రూట్ సేన 205 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది.   

Updated Date - 2021-03-05T17:42:25+05:30 IST