Rishi Sunak: అత్తమామలపై రిషి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-19T13:34:52+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్‌ ఆదివారం రాత్రి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rishi Sunak: అత్తమామలపై రిషి ఆసక్తికర వ్యాఖ్యలు

అత్తమామలను చూసి గర్విస్తున్నా!

నారాయణమూర్తి కష్టపడి పైకివచ్చారు

నా భార్య ఆస్తులపై వార్తలను ఆపండి: రిషి సునాక్‌

లండన్‌, జూలై 18: బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్‌ ఆదివారం రాత్రి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంపై మీడియా చేస్తున్న ప్రచారాన్ని కట్టిపెట్టాలని గట్టిగా చెప్పారు. తన అత్తమామలు ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి, సుధామూర్తిలను చూసి గర్వపడుతున్నానని సునాక్‌ అన్నారు. తన భార్య అక్షత ఆస్తులపై విమర్శలు సరికావన్నారు. అక్షత రూ.20 కోట్ల పన్ను ఎగవేసే అవకాశం ఉన్నా నిజాయితీగా చెల్లించిందని కితాబునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్షత పన్నుల విషయంపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే, వాటిని ఆయన తోసిపుచ్చారు. భారత్‌, బ్రిటన్‌లో ఇన్ఫోసిస్‌ షేర్ల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించేందుకు అక్షతకు చట్టబద్ధంగా వచ్చిన నివాసేతర స్థితిని రద్దు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. తాను బ్రిటన్‌లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అమెరికా గ్రీన్‌ కార్డును వదులుకున్నట్టు చెప్పారు. కాగా, బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో 24శాతం మంది రిషి సునాక్‌కే మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-07-19T13:34:52+05:30 IST