Singur Projectలో పెరుగుతున్న నీటి నిల్వ
ABN , First Publish Date - 2022-07-14T15:33:40+05:30 IST
జిల్లాలోని పుల్కాల్ మండలం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతోంది.
సంగారెడ్డి: జిల్లాలోని పుల్కాల్ మండలం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు(Singur Project)లో నీటి నిల్వ పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి సింగూర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 15 వేల 955 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ 22.417 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుండి దిగువకు నీటి ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది.