Abn logo
Sep 17 2020 @ 09:37AM

పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. 13 గేట్లు మూడు మీటర్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ : 44.897 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 175.89 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 174.44 అడుగులకు చేరుకుంది. ఇన్ ప్లో : 3,44,301 క్యూసెక్కులు కాగా.. అవుట్ ప్లో : 3,15,042 క్యూసెక్కులకు చేరుకుంది.

Advertisement
Advertisement
Advertisement