రాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేశ్‌కు బేడీలు

ABN , First Publish Date - 2020-08-15T09:26:58+05:30 IST

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కత్తి మహేశ్‌ను ..

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేశ్‌కు బేడీలు

హిమాయత్‌ నగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కత్తి మహేశ్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ‘‘శ్రీరాముడు కరోనా ప్రియుడు సుమీ’’ అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు, మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌లో విచారించాక.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వెల్లడించారు.

Updated Date - 2020-08-15T09:26:58+05:30 IST