Aadhaar update: ఆధార్ కార్డులో మీ ఫొటో అప్‌డేట్ కాలేదా?.. ఎక్కడికి వెళ్లకుండా ఇలా చేస్తే చాలు..

ABN , First Publish Date - 2022-09-21T02:08:30+05:30 IST

సిమ్ కార్డు కొనుగోలు నుంచి బ్యాంక్ అకౌంట్ తెరవడం వరకు ఆధార్ కార్డు(Aadhaar Card) పనులేమీ పూర్తవ్వవు.

Aadhaar update: ఆధార్ కార్డులో మీ ఫొటో అప్‌డేట్ కాలేదా?.. ఎక్కడికి వెళ్లకుండా ఇలా చేస్తే చాలు..

సిమ్ కార్డు కొనుగోలు నుంచి బ్యాంక్ అకౌంట్ తెరవడం వరకు ఆధార్ కార్డు(Aadhar Card) లేనిదే పనులేమీ జరగవు.  ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు దక్కవు. అంతేకాదు స్కూల్ లేదా కాలేజీలు, అధికారిక పనులేవైనా ఆధార్ కార్డు ఉండి తీరాల్సిందే. భారతీయ పౌరులకు గుర్తింపునకు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఈ కార్డులో కార్డుదారు వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ డేటా ఉంటాయి. ఒక్కసారి జారీ అయితే జీవితాంతం అదే ఆధార్ కార్డు ఉంటుంది. అయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, ఫొటోలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకువారికి యూఐడీఏఐ(Unique Identification Authority of India) తన అఫీషియల్ వెబ్‌సైట్‌పై ప్రత్యక్షంగా అవకాశం కల్పిస్తోంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా సెంటర్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా ఫొటో అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.


ఫొటో అప్‌డేట్ కోసం ఇది ఫాలోఅవ్వండి..

Step 1: యుఐడీఏఐ(UIDAI) అఫీషియల్ వెబ్‌సైట్‌ uidai.gov.in. ఓపెన్ చేయాలి.

Step 2: వెబ్‌సైటులో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 3: వివరాలన్ని నింపిన తర్వాత సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రం వద్ద సబ్మిట్ చేయాలి.

Step 4: బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఆధార్ ఎగ్జిక్యూటివ్ వివరాలను ధృవీకరిస్తారు.

Step 5: ఆ తర్వాత అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్న ఫొటోపై క్లిక్ చేస్తారు.

Step 6: ఈ సర్వీసుకుగానూ రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ కూడా ఇందులో కలిపి ఉంటుంది.

Step 7: అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్(acknowledgement slip)తోపాటు యుఆర్ఎన్(Update Request Number) ఆధార్ ఎగ్జిక్యూటివ్ అందజేస్తారు.


యుఆర్ఎన్ నంబర్ ఆధారంగా యుఐడీఏఐ వెబ్‌సైట్‌పై లేటెస్ట్ ఆధార్ కార్డును ట్రాక్ కూడా చేయవచ్చు. కాగా ఫొటో అప్‌డేట్ ప్రక్రియకు 90 రోజుల సమయం పడుతుంది. అప్‌డేట్ ప్రక్రియ ముగిసిన తర్వాత సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రం లేదా యుఐడీఏఐ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఈ-ఆధార్(E-Aadhaar)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Updated Date - 2022-09-21T02:08:30+05:30 IST