శ్రీకాకుళం: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.