Advertisement
Advertisement
Abn logo
Advertisement

వసతి గృహ విద్యార్థినులకు అస్వస్థత

పశ్చిమ గోదావరి: వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో గల రాజనగరంలో గిరిజన బాలికల వసతి గృహం ఉంది. దీనిలో ఉంటున్న కొంతమంది విద్యార్థినులు అస్వస్థత లోనయ్యారు. కళ్ళు తిప్పడం, కడుపు నొప్పి లక్షణాలతో 16 మంది బాలికలు కింద పడిపోయారు.


వీరిని వసతి గృహ సిబ్బంది వెంటనే కోట రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాలికలు చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థినుల తల్లితండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ  జరుపుతున్నారు. 

Advertisement
Advertisement