‘టీనేజర్’ అరెస్ట్.. అతడి దుస్తులు రక్తంతో తడిసిపోయాయి.. కారణం ఏంటో తెలిసి స్థానికులకు భారీ షాక్..!

ABN , First Publish Date - 2021-11-20T03:36:22+05:30 IST

తనకు ఆశ్రయమిచ్చిన వ్యక్తినే హతమార్చిన కేసులో యూరీ నోయెల్ నిందితుడని ఫ్లోరిడాలోని ఓ న్యాయస్థానం తేల్చింది. తనో టీనేజర్ అని నమ్మించి, ఆ ఇంట్లో ఆశ్రయం పొంది చివరికి ఇంటి యజమానినే హత్య చేశాడంటూ గ్రాండ్ జ్యూరీ గురువారం తేల్చింది.

‘టీనేజర్’ అరెస్ట్.. అతడి దుస్తులు రక్తంతో తడిసిపోయాయి.. కారణం ఏంటో తెలిసి స్థానికులకు భారీ షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: తనకు ఆశ్రయమిచ్చిన వ్యక్తినే హతమార్చిన కేసులో యూరీ నోయెల్ అనే యువకుడే నిందితుడని ఫ్లోరిడాలోని ఓ న్యాయస్థానం తాజాగా తేల్చింది. తనో టీనేజర్ అని నమ్మించి, ఆ ఇంట్లో ఆశ్రయం పొంది చివరికి ఇంటి యజమానినే హత్య చేశాడంటూ గ్రాండ్ జ్యూరీ గురువారం పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం.. యూరీ కొన్ని నెలల క్రితం పొరుగు దేశం హాండ్యురాస్ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. తానో టీనేజర్ అని అధికారులను మభ్య పెట్టి దేశంలో కాలు పెట్టాడు. ఆ తరువాత.. అదే సాకుతో దువాల్ కౌంటీలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఆ ఇంటి యజమానికి జేవియర్ యూరీ నిజస్వరూపం తెలియక అతడిని ఇంట్లోకి రానిచ్చాడు. అయితే.. ఆక్టోబర్ 7న యూరీ రక్తంతో తడిసిన దుస్తులను ధరించి ఆ పరిసరాల్లో సంచరిస్తుండగా.. స్థానికులు చూసి కంగారు పడిపోయారు. 


విషయం చివరకు పోలీసులకు తెలియడంతో వారు యూరీని అదుపులోకి తీసుకున్నారు. అతడే ఈ హత్య చేసినట్టు తొలుత పోలీసులకు కూడా తెలియదు. అయితే.. విచారణ సందర్భంగా అతడు మారు పేరుతో జేవియర్ ఇంట్లో నివాసం పొందినట్టు, తన వయసును కావాలనే తక్కువ చేసి చూపినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు.. యూరీనే ఈ దారుణానికి పాల్పడ్డట్టు గుర్తించారు. న్యాయస్థానం కూడా యూరీనే హంతకుడని తేల్చింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దీంతో..సరిహద్దు భద్రత పట్ల స్థానికంగా మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫెడరల్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిణామం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-11-20T03:36:22+05:30 IST