కరోనా రోగులకు మందులు అందించేందుకు రోబోలు

ABN , First Publish Date - 2020-04-01T17:38:28+05:30 IST

కరోనా వైరస్ రోగులకు సేవలందించేందుకు రోబోట్లను గువాహటి ఐఐటీ పరిశోధకులు రూపొందించారు....

కరోనా రోగులకు మందులు అందించేందుకు రోబోలు

గువాహటి ఐఐటీ పరిశోధకుల రూపకల్పన

గువాహటి (అసోం): కరోనా వైరస్ రోగులకు సేవలందించేందుకు రోబోట్లను గువాహటి ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. ఐసోలేషన్ వార్డుల్లో కరోనా రోగులకు ఆహారం, ఔషధాలు అందించే వారికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో దీన్ని నివారించేందుకు ఐఐటీ పరిశోధకులు రోబోట్లను రూపొందించారు. గువాహటి ఐఐటీకి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన బృందం ఐసోలేషన్ వార్డుల్లో కరోనా రోగులకు సేవలందించే రోబోట్లను తయారు చేశారు. కరోనా ప్రబలకుండా నివారించేందుకే తాము ఐసోలేషన్ వార్డుల్లో సిబ్బంది స్థానంలో రోబోట్లు రోగులకు కావాల్సిన ఆహారం, మందులను పంపిణీ చేస్తాయని ఐఐటీ పరిశోధకులు చెప్పారు. 

Updated Date - 2020-04-01T17:38:28+05:30 IST